Homepge Slider

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాజీనామా

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ  రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపారు. మాజీ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ అనంతరం 2016 డిసెంబర్‌ 31న లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బైజల్‌ బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఐదున్నరేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో వివాదంతో బైజల్  పలుసార్లు వార్తల్లో నిలిచారు.

Read More »

రెహమాన్‌ కొత్త చిత్రం

ఎ.ఆర్‌. రెహమాన్‌ ఇటీవల ’99 సాంగ్స్‌ అనే పాన్‌ ఇండియా మూవీని నిర్మించి, విడుదల చేశారు. తాజాగా వర్చువల్‌ రియాలిటీ మూవీ అయిన ‘లే మాస్క్‌’ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రస్తుతం జరుగుతున్న కాన్స్‌ ఇంటర్నేషన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. 75 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని అక్కడి వ్యూవర్స్‌ కోసం 36 నిమిషాలకు కుదించారు. రెహమాన్‌ భార్య సైరా ఇచ్చిన ఐడియాలో ఈ చిత్రం రూపుద్దికుంది. అంతర్జాతీయ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ, అత్యుత్తమ సాంకేతిక ...

Read More »

మెగా పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన జగన్‌

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులోని ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను మంగళవారం ప్రారంభించారు. ఒకే యూనిట్‌ నుంచి సోలార్‌, విండ్‌, హైడల్‌ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 5,230 మెగావాట్ల ఉత్పత్తి చేస్తారు.

Read More »

‘సర్కారు వారి పాట’ విజయోత్సవ వేడుకల్లో హీరో మహేష్‌బాబు

సర్కారు వారి పాట సినిమాను విజయవంతం చేసిన అభిమానుల రుణం తీర్చుకోలేనిదని సినీ హీరో మహేష్‌బాబు అన్నారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు కర్నూలులోని ఎస్‌టిబిసి కళాశాల మైదానంలో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ఒక్కడు సినిమా సమయంలో షూటింగ్‌ కోసం కర్నూలుకు వచ్చానన్నారు. అభిమానులు ఇచ్చిన విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. కరోనా వల్ల ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. అభిమానులు ఎప్పుడూ తన గుండెల్లో ఉంటారని, ఇంకా మంచి సినిమాలు తీస్తూనే ఉంటానని పేర్కొన్నారు. అభిమానుల ...

Read More »

రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన జగన్‌

వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది.ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. 

Read More »

తమిళ హీరో ఉదయ నిధి స్టాలిన్ సంచలన నిర్ణయం

తమిళ స్టార్‌ హీరో ఉదయనిధి స్టాలిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌ సినిమా ఇండిస్టీలో మంచి క్రేజ్‌, మార్కెట్‌ ఉన్న హీరోలలో ఆయన కూడా ఒకరు. త్వరలో ఆయన హీరోగా నటించిన ‘నెంజుకు నీధి’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మే 20న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘ఆర్టికల్‌ 15’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించారు.  సెల్వరాజ్‌ దర్శకత్వంలో ‘మామన్నన్‌’ సినిమాను చేస్తున్నారు. ఈ ...

Read More »

తిరుపతిలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పర్యటన

 రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం ప్రత్యేక విమానంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ కె.వెంకట రమణా రెడ్డి సాదర స్వాగతం పలికారు. అక్కడి నుండి 11 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి అనంతపురం జెఎన్‌టియులో జరగనున్న కాన్వొకేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్‌ కె .వెంకటరమణా రెడ్డి, ఎస్‌ పి.పరమమేశ్వర రెడ్డి, ఆర్డీఓ హరిత, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, సిఐఎస్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ శుక్లా, తహసీల్దార్‌ శివప్రసాద్‌, ఎంపిడిఓ, తదితరులు గవర్నర్‌కు స్వాగతం ...

Read More »

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ 500 సెంటర్లలో 50 రోజులు పూర్తి

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ – మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా రూపొందిన పాన్‌ ఇండియన్‌ సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ . ఈ సినిమాను అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 25వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా 500 థియేటర్లలో విజయవంతగా 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ...

Read More »

వరుసగా నాలుగో ఏడాది వైయస్ఆర్ మత్స్యకార భరోసా

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ కోనసీమ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఐ పోలవరం మండలం మురమళ్ల‌లో నాలుగో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ఆయ‌న‌ ప్రారంభించి, అనంత‌రం మురమళ్ల‌ వేదికపై ప్ర‌సంగించారు. భ‌గ‌వంతుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ‌ని, దాదాపు 1,09,000 మందికి మంచి జరిగే కార్యక్రమాన్ని ముమ్మడివరంలో చేయబోతున్నామ‌ని చెప్పారు.ఇందులో భాగంగా నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నామ‌ని తెలిపారు. ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో 109 కోట్ల రూపాయ‌లు జమ చేస్తున్నామ‌ని ...

Read More »

20న ఒటిటిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్‌టిఆర్‌ మల్లీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఒటిటి ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఈనెల 20 నుంచి ప్రముఖ ఒటిటి ప్లాట్‌ఫాం జీ5లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Read More »