Homepge Slider

‘లవ్ స్టోరీ’ కి లాక్ డౌన్ బ్రేక్ పడుతుందా…?

నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇందులో హీరోయిన్ సాయిపల్లవి. ఈ రౌడీబేబీకి దక్షిణాదిన మంచి మార్కెట్ ఉంది. అందుకే ‘లవ్ స్టోరీ’ నిర్మాతలు తమ సినిమాను కన్నడ, మలయాళ భాషల్లోనూ అనువదించి ఒకేసారి ఈ నెల 16న విడుదల చేస్తున్నారు. నిజానికి శేఖర్ కమ్ముల ముందు చిత్రం ‘ఫిదా’లోనూ వరుణ్ తేజ్ కంటే సాయిపల్లవే ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది. అందుకు ఉదాహరణ ‘సారంగధరియా’ పాట. ఈ పాట ...

Read More »

కరోనా ఉధృతి.. 80 వేలకు పైగా కేసులు

కరోనా కమ్ముకొస్తోంది. గడచిన 24 గంటల్లో 81,466 కొత్త కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, మొత్తం కోవిడ్‌ కేసులు సంఖ్య 12,302,110కు చేరింది. మహారాష్ట్రలో కొత్త కరోనా కేసులు 43,183 నమోదయ్యాయి. అత్యధికంగా కోవిడ్‌ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది. ఛత్తీస్‌ఘర్‌, కర్ణాటక రాష్ట్రాల్లో గురువారం 4,000లకు పైగానే కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా బారినపడి గురువారం ఒక్కరోజే 469 మంది మరణించారు. మొత్తం కరోనా మరణాలు 1.63 లక్షలకు చేరింది.దేశంలో కరోనా రెండో దశలో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ...

Read More »

తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం

తైవాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు వెల్లడించిన వివరాల మేరకు… 350 మందితో ప్రయాణిస్తున్న రైలు శుక్రవారం ఉదయం పట్టాలు తప్పడంతో సొరంగ మార్గాన్ని ఢకొీంది. ఈ ఘటనలో 36 మంది మృతి చెందారు. 72 మంది గాయపడ్డారని రవాణా మంత్రిత్వశాఖ ప్రకటించింది. రైల్లోని ప్రయాణీకులంతా పెద్ద ఎత్తున రోదనలు చేశారు. ప్రమాదం నుంచి తమను రక్షించాలంటూ కేకలు వేశారు. ఘటనా స్థలానికి రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్య్కూ టీమ్‌ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ...

Read More »

ప్రముఖ సంగీత దర్శకుడికి కరోనా

ప్రముఖ సినీ సంగీత దర్శకులు, సింగర్‌ బప్పిలహరి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం బప్పిలహరి ముంబయిలోని బ్రీచ్‌ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ… అనుకోకుండా ఆయనకు కరోనా సోకిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, బ్రీచ్‌ కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కొన్ని రోజులుగా ఆయనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని బప్పిలహరి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసినట్లు ప్రతినిధి తెలిపారు. తాను త్వరగా కోలుకుని బయటకు రావాలని దేశ, విదేశాల్లో ...

Read More »

చరిత్ర సృష్టించనున్న కేరళ !

ప్రతిష్టాత్మకమైన కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 6న ఒకే దశలో జరగనున్నాయి. గతానికి భిన్నంగా వరుసగా రెండోసారి కూడా రాష్ట్ర ప్రజలు ఎల్‌డిఎఫ్‌కు విజయం కట్టబెట్టడం ద్వారా చరిత్ర సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాల క్రితం ఒకే పార్టీ లేదా కూటమి రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అటువంటి అరుదైన విజయం సాధించబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌)కి సానుకూల పవనాలు వీస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎల్‌డిఎఫ్‌ ...

Read More »

కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నజగన్‌

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దంపతులు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గుంటూరు భారత్‌ పేట 140వ నెంబర్‌ సచివాలయంలో వారు టీకా తీసుకున్నారు. ముందుగా అధికారులు ఆక్సి మీటర్‌ ద్వారా ఆక్సిజెన్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం టీకా వేశారు. ప్రస్తుతం సిఎం జగన్‌, భారతిలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Read More »

ఎస్‌ఈసిగా నీలం సహాని బాధ్యతల స్వీకరణ

ఎపి ఎస్‌ఈసిగా నీలం సహాని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను కమిషన్‌ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు అభినందించారు. ఇప్పటి వరకు ఎస్‌ఈసిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పదవీకాలం మార్చి 31తో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సహాని నియమితులయ్యారు. కొత్త ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించింది. నీలం సహాని పేరును గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఖరారు చేశారు.

Read More »

ఎపి నుండి తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు

ఎపిలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన క్లాస్‌-3, క్లాస్‌-4 ఉద్యోగులను రిలీవ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన 711 ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. వీరి తరపున కొంతమంది ప్రతినిధులు గురువారం సీఎం జగన్‌ను కలిసి తెలంగాణ ప్రభుత్వంలో సర్వీసులు కొనసాగించేందుకు వీలుగా తమను రిలీవ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం వారిని రిలీవ్‌ చేసేందుకు అంగీకారం తెలిపారు. అనంతరం సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. సొంతరాష్ట్రానికి వెళ్తున్న ఉద్యోగులకు సీఎం జగన్‌ ...

Read More »

మేలో కిసాన్‌ పార్లమెంట్‌ మార్చ్‌

వ్యవసాయ వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మే నెలలో ”కిసాన్‌ పార్లమెంట్‌ మార్చ్‌” నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నాయకులు తెలిపారు. సింఘూలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం ఎస్‌కెఎం నేతలు గుర్నాం సింగ్‌ చాధుని, ప్రేమ్‌ సింగ్‌ భాంగు, సత్నం సింగ్‌ అజ్నాలా తదితరులు భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 5న ఎఫ్‌సిఐ బచావ్‌ దివస్‌లో భాగంగా ఎఫ్‌సిఐ కార్యాలయాల వద్ద ఘెరావ్‌ నిర్వహిస్తామని, 10న కుండ్లి-మనేసర్‌-పల్వాల్‌ (కెఎంపి) ...

Read More »

కృష్ణానది రిటైనింగ్‌ వాల్‌కు జగన్ శంకుస్థాపన

విజయవాడ కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్‌ వరకు కృష్టా నది ఎడమవైపున వరద రక్షణ గోడ (రిటైనింగ్‌ వాల్‌) నిర్మాణానికి సిఎం వైఎస్‌ జగన్‌ బుధవారం శంకుస్ధాపన చేశారు. 1.5 కిలోమీటర్ల మేర రూ.122.90 కోట్ల వ్యయంతో కృష్ణా నది వరద ఉధృతిని తట్టుకునేలా రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించనున్నారు. ఈ గోడ నిర్మాణంతో కృష్ణా నది కరకట్టకు చెందిన రాణీగారితోట, తారకరామానగర్‌, భూపేష్‌గుప్తా నగర్‌ ప్రాంతాలలో నివాసముంటున్న సుమారు 31 వేల మంది ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత ఉపశమనం కలుగనుంది.

Read More »