లక్షద్వీప్‌కు చెందిన నటి, మోడల్, దర్శకురాలు ఆయేషా సుల్తానాకు కేరళ హైకోర్టు యాంటిసిపేటరి బెయిల్ మంజూరు చేసింది. లక్షద్వీప్ పోలీసులు రాజద్రోహం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్ అశోక్ మీనన్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రశాంతంగా ఉండే దీవిలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, కరోనా కేసుల్ని అరికట్టడంలో విఫలమైనందుకు ప్రఫుల్‌ని కేంద్రం ప్రయోగించిన ...
Read More »Crime
అనుమానంతోనే అనూష హత్య : ఎస్‌పి
అనుమానంతోనే అనూషను తోటి విద్యార్థి విష్ణువర్థన్‌రెడ్డి హత్య చేశాడని నరసరావుపేట రూరల్ ఎస్‌పి విశాల్‌గున్నీ తెలిపారు. నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్యోదంతం సంచలనం రేపింది. శుక్రవారం ఎస్‌పి విలేకర్ల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనూష వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని విష్ణుకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 24న అనూషను నరసరావుపేటకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె గొంతు నులిమి చంపాడు. అనంతరం అక్కడ సాక్ష్యాధారాలు లేకుండా చేయాలని ప్రయత్నించాడని పేర్కొన్నారు. దీనికి సంబంధించి నిందితుడికి ...
Read More »సుశాంత్ రాజ్‌పుత్ కేసులో ఏ సమాచారం లీక్ కాలేదు : సిబిఐ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి ఏటువంటి సమాచారాన్ని.. ఏ సమయంలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ). నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి)లు లీక్ చేయలేదని అదనపు సొలిసిటర్ జనరల్(ఎఎస్‌జి) అనిల్ సింగ్ బాంబే హైకోర్టుకు తెలిపారు. సుశాంత్ ఈ ఏడాది జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మీడియా ప్రచారాన్ని, రిపోర్టింగ్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బాంబే హైకోర్టు శనివారం విచారణ జరిపింది. ఈ ...
Read More »డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్టు
సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రేయసి రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో రియాను మూడు రోజుల నుండి ఎన్‌సిబి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ఎన్‌సిబి అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించింది. అయితే తాను మాత్రం డ్రగ్స్ వాడలేదని, సుశాంత్ కోసమే కొనుగోలు ...
Read More »రియా సోదరుడు, సుశాంత్ మేనేజర్ అరెస్ట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇద్దరినీ దాదాపు 10 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్ చేసినట్టు ఎన్‌సిబి అధికారులు తెలిపారు. అంతకుముందు ఉదయం షోవిక్, మిరండా నివాసాల్లో ఎన్‌సిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షోవిక్ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. షోవిక్ చక్రవర్తి గంజాయి, ...
Read More »సుశాంత్ కేసు సిబిఐకి అప్పగింత!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మతి పట్ల యావత్ దేశ వ్యాప్తంగా అనుమానాలు వెల్లెవెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో బీహార్ సిఎం నితీష్ కుమార్ సుశాంత్ కేసుని సిబిఐకి అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్రం ఈ కేసును సిబిఐకి బదలాయిస్తున్నట్టు వెల్లడించింది. గత కొంత కాలంగా సుశాంత్ కేసు కొలిక్కి రావడం లేదు. రోజుకో ట్విస్ట్ బయటికి వస్తోంది. దీనికి తోడు సుశాంత్ కేసుని విచారిస్తున్న ముంబై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. సుశాంత్ తండ్రి పెట్టిన కేసు విచారణ కోసం ...
Read More »లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ”అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా.. ‘ అన్న లోకేష్ స్టేట్ మెంట్ చూసి.. చంద్రబాబు.. ‘ఆహా..! నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు’ అని గర్విస్తాడా, లేక…’ అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ‘లోకేష్…! సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా…! తీసుకుంటున్నావా…? ఎందుకయ్యా.. రాజకీయాల్లో ...
Read More »‘వైఎస్సార్ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్
దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ ...
Read More »మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు
టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మునిసిపల్ కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్ర పటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్ గదిలోకి మార్చారు. విషయం తెలిసిన మాజీ మంత్రి ఆ ఫొటోను యథాస్థానంలో ఉంచాలంటూ మునిసిపల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఆ సమయంలో మునిసిపల్ కమిషనర్ టి. కఅష్ణవేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు ...
Read More »డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిబాయి గురువారం హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. తన కొడుకు సుధాకర్‌ను అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని, 24 గంటల్లో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ పిటిషన్ వేశారు. విచారణ అనంతరం ఎపిలో సంచలనంగా మారిన విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ వైద్యశాల మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి ఆయన అనుమతితో సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జ్ కావొచ్చని హైకోర్టు సూచించింది. అయితే ...
Read More »