News

విజయవాడ ఈస్ట్లో గెలిచేది ఎవరో?

విజయవాడ ఈస్ట్.. రాష్ట్రంలోని హాట్సట్లలో ఒకటి. దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా, మాజీ CM నాదెండ్ల భాస్కరరావు ఇక్కడి నుంచి గెలుపొందారు. ఇక్కడ 1983లో TDP గెలిచింది. ఆ తర్వాత 2014, 19లో వరుసగా నెగ్గిన గద్దె రామ్మోహన్ మరోసారి TDP నుంచి పోటీకి సై అంటున్నారు. YCP నుంచి దేవినేని అవినాష్ బరిలో దిగుతున్నారు. తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలిపిస్తాయని ఇద్దరు నేతలు ధీమాగా ఉన్నారు.

Read More »

వైఎస్ జగన్ యాత్ర నేటి షెడ్యూల్

ఏపీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ యాత్ర 6వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం 9 గంటలకు చీకటిమానిపల్లె నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. గొల్లపల్లి మీదుగా జగన్ అంగళ్లు గ్రామం చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30గంటలకు మదనపల్లెలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిమ్మనపల్లి, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లెకు చేరుకుంటారు. రాత్రికి అమ్మగారిపల్లె శివారులో బస చేయనున్నారు.

Read More »

చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు: బొత్స సత్యనారాయణ

పెన్షన్లను అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు వార్తలను రాస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెన్షన్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారని… ఈ సంస్థకు నిమ్మగడ్డ రమేశ్ అధ్యక్షుడు అని చెప్పారు. నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని అన్నారు. వికలాంగులకు, పెన్షనర్లకు వీళ్లంతా ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. కొంతైనా మానవత్వం ఉండొద్దా అని ...

Read More »

పెన్ష న్లపై కీలక అప్ డేట్

పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల ప్రమేయం ఉండొద్దని ఈసీ ఆదేశించిన వేళ.. సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయవచ్చని పలువురు కలెక్టర్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా వారంలో పెన్షన్లు ఇవ్వొచ్చని చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో కొంచెం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. పెన్షన్ల పంపిణీపై రాత్రికి మార్గదర్శకాలు ఇస్తామని సీఎస్ పేర్కొన్నారు.

Read More »

ఇప్పుడా వాలంటీర్ల విధులను ఎవరు నిర్వర్తించాలన్న తమ్మినేని సీతారాం..

రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించడంపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లపై విపక్ష నేతలు కక్ష కట్టారంటూ మండిపడుతున్నారు. తాజాగా ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని ఫిర్యాదు చేయడం కుట్ర పూరిత చర్య అని విమర్శించారు. వాలంటీర్లకు అధికారాలు అప్పజెప్పడం జరగదని, వారు అందించే సేవలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని… వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన రోజే సీఎం జగన్ చెప్పారని తమ్మినేని సీతారాం వివరించారు. అదే ...

Read More »

కాంగ్రెస్‌లో సామ రామ్‌మోహన్ రెడ్డికి కీలక పదవీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల వేళ మరో కీలక నియామకం చేపట్టింది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవహారాల చైర్మన్‌గా సామ రామ్ మోహన్ రెడ్డిని నియమించారు. టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సామ రామ్‌మోహన్ రెడ్డి టీపీసీసీ అఫిషియల్ స్పోక్స్ పర్సన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆయన చురుకుగా ఉంటారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ గెలుపే ...

Read More »

టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్సీ..

ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా సీట్లకు ముడిపడి.. నేతల వలసలు కొనసాగుతున్నాయి.. వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీ, బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి.. నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో బాపట్లలో సమావేశం అయ్యారు. జంగా కృష్ణమూర్తితో పాటు నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. త్వరలో గురజాలలో జరిగే ...

Read More »

సీఎం జగన్‌ బస్సు యాత్రకు పొటెత్తిన జనం…

సీఎం జగన్‌ బస్సు యాత్రకు జనం పొటెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు పొటెత్తారు జనం. రెండు చోట్ల భారీ గజమాలతో సిఎం జగన్ కు స్వాగతం పలికారు ప్రజలు. బత్తలపల్లిలో రోడ్డుకు రెండువైపులా దారిపొడవునా వేచిచూస్తున్న ప్రజలకు బస్సుపై నుంచి అభివాదం చేస్తున్నారు జగన్. ఈ సందర్భంగా కొంత మంది పేద ప్రజలతో కూడా సీఎం జగన్‌ మాట్లాడారు. కాగా…పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటగుళ్ల వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్‌. ...

Read More »

పార్లమెంట్ ఎన్నికల బరిలో షర్మిల..

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు తెరపడింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కడప సిట్టింగ్ ఎంపీ, ఆమె సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని షర్మిల ఢీకొట్టనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో ఇవాళ జరిగిన సీఈసీ మీటింగ్‌లో ఏపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై చర్చించిన అనంతరం క్యాండిడేట్లను ఫైనల్ చేశారు. మరో 58 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించకుండా కాంగ్రెస్ హోల్డ్‌లో పెట్టింది. ...

Read More »

కాసేపట్లో తీహార్ జైలుకు కేజ్రీవాల్ తరలింపు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేజ్రీవాల్ కు కోర్టు విధించిన ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో, ఆయనను ఈరోజు కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను కాసేపట్లో ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్తుండటం ఇదే ...

Read More »