News

ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం

ఏపీలో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 27న ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇద్దరు నేతలూ రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. దీంతో, ప్రధాన పార్టీల ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుంచి సీఎం జగన్, చంద్రబాబు ...

Read More »

తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన గాలి జనార్దన్ రెడ్డి

లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజీకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన సొంత గూడు బీజేపీలోకి చేరారు. తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ)ని బీజేపీలో విలీనం చేశారు. మాజీ ముఖ్యమత్రి యడియూరప్ప సమక్షంలో తన పార్టీని బీజేపీలో కలిపారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… తన పార్టీని బీజేపీలో విలీనం చేశానని, బీజేపీలో చేరానని ...

Read More »

ఎంపీ టికెట్ పై క్లారిటీ ఇవ్వని బీజేపీ: రఘురామకృష్ణంరాజు

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో టికెట్ల కేటాయింపులో ఆయా పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారనే చర్చ జోరుగా కొనసాగుతోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖాయమైంది. కాగా, బీజేపీలో చేరి నరసాపురం నుంచి పోటీ చేయాలనుకున్న రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ అధిష్టానం టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఆయన ఇప్పటికే చంద్రబాబుతో కలిసి నడస్తున్నాని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఆయనకు టీడీపీ ...

Read More »

ఎన్నికల్లో పోటీ చేయబోతున్న బాలీవుడ్ నటి..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆమె స్వరాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ సీటును కంగనాకు కేటాయిస్తూ బీజేపీ ఆదివారం రాత్రి ప్రకటన వెలువరించింది. దీంతో అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న కంగనా.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు.నా ప్రియమైన భారతదేశం, ఈ దేశ ప్రజల సొంత పార్టీ అయిన బీజేపీకి ఎల్లప్పుడూ నా బేషరతు మద్దతు వుంటుంది. నా సొంత రాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ అధిష్ఠానం నా పేరుని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విషయంలో హైకమాండ్ ...

Read More »

మిస్సింగ్ మొబైల్ గా పేర్కొన్న ఈడీ అధికారులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపొందించిన సమయంలో ఉపయోగించిన ఫోన్ గురించి ప్రశ్నించగా తెలియదని సీఎం కేజ్రీవాల్ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. ఆదివారం విచారణలో భాగంగా ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆ ఫోన్ ఎక్కడ ఉందో తనకు తెలియదని కేజ్రీవాల్ చెప్పినట్టుగా సమాచారం. కాగా ఈ ఫోన్‌ను మిస్సింగ్ మొబైల్ గా ఈడీ అధికారులు పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Read More »

ఎన్నికల వేళ హస్తం పార్టీకి మరో షాక్ ..

ప్రముఖ పారిశ్రామికవేత్త, జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. ఆదివారం పార్టీ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు బీజేపీలో చేరినట్టు నవీన్ జిందాల్ తెలిపారు. హర్యానా నుంచి 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నా. అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్‌కు, కాంగ్రెస్ నాయకత్వానికి ధన్యవాదాలు చెబుతున్నా. ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ ...

Read More »

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్టు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్టులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఈ కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉన్నదని మేక శరణ్ కవితకు అత్యంత ...

Read More »

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి

ప్రముఖ సినీ నిర్మాత అచ్చిరెడ్డి, టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిలు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలుస్తున్నారు. గతంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, నిర్మాత దిల్ రాజు తదితరులు కలిశారు.

Read More »

చంద్రబాబు కాన్వాయ్‌ అడ్డగింత..

విజయవాడలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. వెస్ట్‌ టికెట్‌ జలీల్‌ఖాన్‌కు కేటాయించాలని మైనార్టీలు నిరసనకు దిగారు. ఏ కన్వెన్షన్ హాలులో టీడీపీ వర్క్ షాపుకు చంద్రబాబు హాజరవ్వగా, ఆయన కాన్వాయ్‌ను జలీల్‌ఖాన్‌ వర్గం అడ్డుకుంది. పొత్తులో వెస్ట్‌ సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. జలీల్‌ఖాన్‌ మద్దతుదారుల నిరసనతో చంద్రబాబు కంగుతిన్నారు. కాగా, తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ జలీల్ ఖాన్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ టికెట్ల చిచ్చు రగులుతూనే ఉంది. టీడీపీ శుక్రవారం.. ఎంపీ, ...

Read More »

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏప్రిల్‌ 2, 3 తేదీల్లో బస్సు యాత్ర

ఈ నెల 27న మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చే నెల 2, 3, తేదీల్లో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. మూడో తేదీ సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సు యాత్ర ప్రారంభమవుతుందని, తిరుపతి పార్లమెంట్ పరిధిలో శ్రీకాళహస్తి, నాయుడుపేటలో బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు.

Read More »