Politics

14వ రోజుకు చేరిన జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజుకు చేరింది. ఉమ్మడి గుంటూరు (D) నంబూరు బైపాస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాజా, మంగళగిరి బైపాస్, CK కన్వెన్షన్ మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి కానున్నారు.

Read More »

సోనియానే ఎదిరించారు.. పవన్ ఎంత?: వెల్లంపల్లి శ్రీనివాస్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఓ వైపు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని విమర్శిస్తున్న చంద్రబాబు… ఇప్పుడు ఎన్నికలు రావడంతో ప్రతి ఇంటికి రెండు పథకాలు ఇస్తానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేనప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ నగర అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారని… ఆయనకు విజయవాడలో తిరిగే అర్హత లేదని అన్నారు. కక్ష సాధింపులను పాల్పడేది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ...

Read More »

రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్… రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మైక్ వీరుడంటూ ఎద్దేవా చేశారు. మైక్ పట్టుకుంటే చాలు పూనకం వచ్చి… ఏది పడితే అది మాట్లాడుతాడన్నారు. భువనగిరి పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్, బీజేపీ వారికి భయపడేది లేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని… అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రియ‌ల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటే రియ‌ల్ ఎస్టేట్ ...

Read More »

కవితకు చుక్కెదురు.. సీబీఐ అరెస్ట్ ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయాడాన్ని సవాల్ చేస్తూ ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ఆమె పిటిషన్లను కొట్టి వేసింది. తనను అరెస్ట్ చేయడం, తనను ప్రశ్నించడం రెండు అంశాలపై ఆమె రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. మరోవైపు, కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలనే ...

Read More »

వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య?

వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరును పార్టీ అధినేత కేసీఆర్ దాదాపు ఖరారు చేశారు. పార్టీ అధినేత నుంచి పిలుపు రావడంతో రాజయ్య ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయలుదేరారు. ఇరువురు చర్చించుకున్న అనంతరం కేసీఆర్ రాజయ్య పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టిక్కెట్ నిరాకరించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది.

Read More »

షర్మిల చేసిన త‌ప్పు అదే: విజ‌య‌సాయి రెడ్డి

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌పై ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ష‌ర్మిల‌ తెలంగాణ‌లో పార్టీ పెట్టిన‌ప్పుడు తాము ఏమీ అన‌లేద‌ని, కానీ ఏపీకి వచ్చి కాంగ్రెస్‌లో చేర‌డం ఆమె చేసిన రాజ‌కీయ త‌ప్పిదం అని అన్నారు. ఆమె వెనుక ఎవ‌రు ఉన్నారో కూడా అంద‌రికీ తెలుస‌ని విజ‌య‌సాయి అన్నారు. అలాగే సీఎం జ‌గ‌న్‌తో ష‌ర్మిల రాజ‌కీయంగా విభేదించిన మాట వాస్త‌వ‌మేన‌న్నారు. ఇక ఎన్‌డీఏలో వైసీపీ చేరిక‌పై కూడా ...

Read More »

ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై CM రేవంత్ స్పెషల్ ఫోకస్

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సెక్రెటేరియట్‌లో సంబంధిత విభాగాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర అంశాలు, పలు మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించారు. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యలు, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై అధికారులతో చర్చించనున్నారు. కాగా, నిన్న ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం ...

Read More »

కాసేపట్లో వేంపల్లెలో షర్మిల బస్సుయాత్ర.. సునీతతో కలిసి రోడ్‌షోలు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు వైఎస్సార్ జిల్లా పులివెందులలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మాజీమంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి రోడ్‌షోలు, సభల్లో పాల్గొంటారు. మరికాసేపట్లో వేంపల్లెలో బస్సుయాత్ర ప్రారంభిస్తారు. లింగాల, సింహాద్రిపురంలో పర్యటన అనంతరం సాయంత్రం ఆరున్నర గంటలకు పులివెందుల చేరుకుంటారు. అక్కడ రోడ్‌షో అనంతరం సభలో ప్రసంగిస్తారు. షర్మిలకు మద్దతుగా సునీత దంపతులు కూడా ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. నియోజకవర్గంలోని పలువురు నేతలను నిన్న కలిశారు. షర్మిల రేపు జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో పర్యటిస్తారు. దీంతో ఈ విడత బస్సుయాత్ర ...

Read More »

చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల -కొండా రాఘవరెడ్డి

చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల.. అంటూ వైఎస్సార్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపిందని.. ఆయన లాంటి విషసర్పాలకు పాలుపోస్తావా? అంటూ నిలదీశారు. వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోబోమని.. తెలంగాణలో కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించిందని షర్మిలపై నిప్పులు చెరిగారు వైఎస్సార్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి. ఇప్పుడు ఇక్కడికొచ్చి రాజకీయం చేస్తోందన్నారు. షర్మిల ఎన్నికుట్రలు చేసినా… ఎవరూ పట్టించుకోరని.. వైసీపీ విజయం సాధిస్తుందన్నారు వైఎస్సార్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి.

Read More »

13వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్‌ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల బస నుంచి సీఎం వైఎస్‌ జగన్ బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో ...

Read More »