Politics

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను మార్చి 31వరకు పొడిగించినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) తెలిపింది. గతంలో విధించిన నిషేధం ఈ నెల 28తో ముగియ నుంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మరోసారి నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డిజిసిఎ ప్రకటించింది. అయితే కార్గో విమానాలు, ఎయిర్‌ బబుల్‌ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక విమానాలకు ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చింది. కాగా, భారత్‌ సుమారు 27 దేశాలతో ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దేశాల ...

Read More »

మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదు

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌ రెడ్డిపై మరో కేసు నమోదైంది. జెసి పిఎ ఇంట్లో 130 క్రికెట్‌ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా కిట్లను పంపిణీ చేసేందుకే తీసుకొచ్చారని తేల్చారు. దీంతో జెసి ప్రభాకర్‌ రెడ్డి, పిఎ గౌరీనాథ్‌లపై కేసు నమోదు చేశారు. ఇద్దరిపై 188, 171 సెక్షన్ల కింద కేసు నమోదైంది. స్థానిక జూనియర్‌ కళాశాల సమీపంలోని బృందావనం అపార్ట్‌మెంట్‌లో, జెసి సోదరుల అనుచరుడి పెంట్‌హౌస్‌లో పెద్ద ఎత్తున క్రికెట్‌ కిట్లను పోలీసులు స్వాధీనం ...

Read More »

మార్చి 5వ తేదిన రాష్ట్ర బంద్‌

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 5వ తేదిన రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చింది. మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు చెంపపెట్టుగా ప్రజానీకం ఈ బంద్‌లో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. విజయవాడలోని దాసరి భవన్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నాయకులు జి.ఓబులేశు, వి.ఉమామహేశ్వరరావు, పి.గౌతంరెడ్డి ఈ మేరకు ప్రకటించారు. అంతకు ముందు విశాఖపట్నంలో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన రాస్తారోకోలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఐదవ ...

Read More »

నవ్‌దీప్‌ కౌర్‌కు బెయిల్‌ మంజూరు

కార్మిక హక్కుల కార్యకర్త నవ్‌దీప్‌ కౌర్‌కు పంజాబ్‌, హర్యానా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హర్యానాలో సోనిపట్‌లోని ఒక పారిశ్రామిక యూనిట్‌ ముందు ధర్నా చేసి…ఆ సంస్థ నుండి డబ్బులు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలపై గత నెల 12న నవ్‌దీప్‌ కౌర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఎట్టకేలకు ఆరు వారాల తర్వాత ఆమెకు ఉపశమనం లభించింది. ఆమెకు బెయిల్‌ మంజూరైనట్లు నవ్‌దీప్‌ కౌర్‌ న్యాయవాది అర్ష్‌దీప్‌ సింగ్‌ చీమా తెలిపారు. ఆమె బెయిల్‌ పిటిషన్‌లో, తనపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించడంతో పాటు దాడి ...

Read More »

ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైసిపి

అసెంబ్లీ కోటా నుండి ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను వైసిపి ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకర్ల సమావేశంలో పేర్లను ప్రకటించారు. బల్లి కళ్యాణ చక్రవర్తి, మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా భగీరథరెడ్డి, సి.రామచంద్రయ్య, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్‌లు ఉన్నారు.

Read More »

మహారాష్ట్రలో 186 మంది విద్యార్థులకు కరోనా

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. వాషిం జిల్లాలోని ఒక పాఠశాలకు చెందిన హాస్టల్‌లో 190 కరోనా కేసులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 186 మంది విద్యార్థులతో పాటు నలుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకిందని అన్నారు. దీంతో ఆ హాస్టల్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ విద్యార్థులు అమరావతి, యవాత్మల్‌ జిల్లాల నుండి వచ్చారని, ఈ రెండు జిల్లాల్లో అధికంగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కాగా, గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 8వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు కరోనా నిబంధనలను పాటించకపోతే.. కఠిన ...

Read More »

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ

ఎపిలో ఉపాధ్యాయ, తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నేడు నామినేషన్లను పరిశీలించి తుది జాబితాను ప్రకటించనున్నారు. ఎపిలో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. కృష్ణా-గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 20 నామినేషన్లు దాఖలు కాగా.. తూర్పు-పశ్చిమగోదావరి ఎమ్మెల్సీ స్థానానికి 12 నామినేషన్లు వచ్చాయి. 2 స్థానాలకు గానూ మొత్తం 32 నామినేషన్లు దాఖలైనట్లు ఎస్‌ఇసి ప్రకటించింది. కాగా, ఎపిలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు ...

Read More »

ఆటోడ్రైవర్‌ కు రూ. 24 లక్షల విరాళాలు పంపిన నెటిజన్లు

తన మనవరాలి చదువు కోసం ఇంటిని అమ్మిన ముంబయి ఆటో డ్రైవర్‌ కథను చదివిన పలువురు నెటిజన్లు ఆయనకు విరాళాలు పంపారు. ఈ విధంగా వచ్చిన విరాళాలు ఏకంగా రూ. 24 లక్షలకి చేరాయి. హృదయవిదారకమైన దేశ్‌రాజ్‌ కథను ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే పోర్టల్‌లో సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అనంతరం దేశ్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఇద్దరు కుమారులు మరణించడంతో కుటుంబపోషణను తన భుజాలపై వేసుకున్నానని అన్నారు. ఇద్దరు కోడళ్లతో పాటు వారి నలుగురు సంతానాన్ని పోషించాల్సిన బాధ్యత తనదేనని అన్నారు. ...

Read More »

హిందూపురంలో బాలకృష్ణకు ఎదురుదెబ్బ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గం హిందూపురంలో ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో ఉన్న 38 సర్పంచ్‌ స్థానాలకు గానూ 30 స్థానాల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. పెనుకొండ టిడిపి మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధికి కూడా షాక్‌ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో సర్పంచ్‌ అభ్యర్థి, మరువపల్లిలో వార్డు అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైసిపి మద్దతుదారులు గెలుపొందారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టిడిపి బలపర్చిన ...

Read More »

మహిళ రైతులతో అపోలో ఒప్పందం

డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీతో కలిసి పని చేస్తోన్న 5,000 మంది మహిళా రైతులతో అపోలో హాస్పిటల్స్‌ ఒప్పందం చేసుకుంది. వీరి నుంచి సేకరించిన తృణ ధాన్యాలను అపోలో క్యాంటీన్లలో ఉపయోగించనున్నారు. ఇప్పటికే 4వేల కిలోల తృణ ధాన్యాలు కొనుగోలు చేయగా తాజాగా సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా రైతులకు మద్దతుగా ప్రతీ నెల మరో వెయ్యి కిలోల ధాన్యాలను సేకరించనున్నట్లు వెల్లడించింది. ఆరోగ్యకరమైన జీవనానికి స్థానికంగా లభించే వాటినే తినడం, పండించడం చేయాలని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ సిఎస్‌ఆర్‌ వైస్‌ ఛైర్మన్‌ ఉపాసన కొణిదెల ...

Read More »