Politics

ఏపీలో బచ్చా రాజకీయం.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

తమ సభలకు వస్తున్న స్పందన చూసి కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని.. వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. తనను బచ్చా అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబును చూస్తుంటే కృష్ణుడిని బచ్చా అన్న కంసుడు గుర్తుకు వస్తున్నాడని సెటైర్లు వేశారు.. తనను బచ్చా అన్న వ్యక్తి పది మందిని వెంటవేసుకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు. బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని నన్ను చుట్టుముట్టారని వ్యాఖ్యానించారు. కానీ తాను ...

Read More »

ఇంకా తానే ముఖ్యమంత్రిని అని కేసీఆర్ అనుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

తెలంగాణకు ఇంకా తానే ముఖ్యమంత్రిని అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్ నుంచి నీలం మధు గెలవాలన్నారు. తనతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. అసలు ...

Read More »

ఎలక్టోరల్‌ బాండ్లలో పవన్‌కు ఎంత ముట్టింది?: పోతిన మహేష్‌

ఎలక్టోరల్‌ బాండ్స్‌లో పవన్ కల్యాణ్‌కి ఎంత ముట్టిందో చెప్పాలంటూ వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీని పైకి తీసుకురావడమే పవన్‌ అజెండానా? అంటూ దుయ్యబట్టారు. పోతిన మహేష్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు దగ్గర పవన్‌ ప్యాకేజీ తీసుకున్నారని అందరికి తెలుసు. జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని?. బినామీ పేర్లతో ఉన్న పవన్‌ ఆస్తుల వివరాలు నేనే బయటపెడతా’’ అని పోతిన హెచ్చరించారు. కౌలు రైతుల పేరుతో ఎన్నారైల నుంచి వసూలు చేసిన చందాలెంత?. అందులో రైతులకు ...

Read More »

ఓటమి భయంతో చంద్రబాబుకు ఫ్రస్టేషన్: వాసిరెడ్డి పద్మ

టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే హత్యా రాజకీయాలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సాక్షాత్తూ సీఎంపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. మంగళగిరి వైఎస్సార్‌సీపీ నేత వెంకటరెడ్డిని ఢీకొట్టి చంపేశారని, వైఎస్సార్‌సీపీ నాయకులు,సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు,లోకేష్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయి. కేసులుంటే పదవులని లోకేష్ చెబుతున్నాడు. ఓటమి అంచున ఉన్నారు కాబట్టే దాడులకు పాల్పడుతున్నారు. చంద్రబాబుకు అభివద్ధి.. పాలన చేయడం తెలుసా? ...

Read More »

జగన్‌ పై రాయి దాడి…ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

జగన్‌ పై రాయి దాడి జరుగడంపై…ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి అమానుషమని మండిపడ్డారు. జగన్ కు రాయి తగలడం టీవీలో లైవ్ చూసానని తెలిపారు. ముందు రాయి అనుకోలేదని…రాయి గట్టిగానే తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్లు వేశారు కానీ వాళ్లకు తాగలేదంటూ ఎద్దేవా చేశారు.

Read More »

వేమిరెడ్డి రూ. 1000 కోట్లు.. నారాయణ రూ. 500 కోట్లు ఖర్చుపెడతారట: విజయసాయిరెడ్డి

నెల్లూరు వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ. 1000 కోట్లు, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ అభ్యర్థి పి.నారాయణ రూ. 500 కోట్లు ఖర్చు పెడతారట అని ఆరోపించారు. ఎన్నడూ లేనంతగా నెల్లూరు జిల్లాలో డబ్బు రాజకీయాలను తీసుకొచ్చిన ఘనత టీడీపీ నేతలదేనని విమర్శించారు. టీడీపీ నేతలు ...

Read More »

జగన్ పై దాడి కేసులో బొండా ఉమ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: వెల్లంపల్లి

టీడీపీ నేత బొండా ఉమకు ఓటమి భయం పట్టుకుందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దొంగచాటుగా బొండా ఉమ ఎందుకు నామినేషన్ వేశారని… తప్పు చేశాడు కాబట్టే బొండా ఉమ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. బొండా ఉమ నామినేషన్ కార్యక్రమానికి ఆయన కొడుకు తప్ప మరెవరూ వచ్చిన దిక్కు లేదని అన్నారు. బొండా ఉమను అరెస్ట్ చేయబోతున్నారంటూ… ఆయనే మెజేస్ లు ఫార్వర్డ్ చేశారని ఆరోపించారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే కనిపిస్తోందని అన్నారు. జగన్ పై రాయి దాడి కేసులో ...

Read More »

మూడోసారి గెలిస్తే UCC అమలు చేసి తీరుతాం:
అమిత్ షా

బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసి తీరుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ‘మన దేశం షరియా చట్టాలు, వ్యక్తిగత చట్టాలపై నడవాలా? ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ వ్యక్తిగత చట్టాలకు చోటు లేదు. మరి భారత్లో ఎందుకున్నట్టు? పలు ముస్లిం దేశాలే షరియా చట్టానికి దూరంగా ఉంటున్నాయి. మనమూ ముందడుగు వేయాలి’ అని తెలిపారు.

Read More »

షర్మిలకు ఈసీ నోటీసులు

APPCC చీఫ్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Read More »

టీడీపీకి ఈసీ నోటీసులు

సీఎం జగన్పై రాయి దాడి తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ జనరల్ సెక్రటరీకి సీఈవో నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జై టీడీపీ, తెలుగు దేశం పార్టీ అకౌంట్ల నుంచి జగన్పై అనుచిత పోస్టులు చేశారని సీఈవోకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.

Read More »