Politics

టీడీపీకి ఈసీ నోటీసులు

సీఎం జగన్పై రాయి దాడి తర్వాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ జనరల్ సెక్రటరీకి సీఈవో నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జై టీడీపీ, తెలుగు దేశం పార్టీ అకౌంట్ల నుంచి జగన్పై అనుచిత పోస్టులు చేశారని సీఈవోకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు.

Read More »

ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ పూర్తి: సీఎం రేవంత్

ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని, వరికి రూ.500 బోనస్ ఇస్తామని CM రేవంత్ పునరుద్ఘాటించారు. మహబూబాబాద్ సభలో మాట్లాడుతూ ‘అయ్య పేరు, తాత పేరు చెప్పుకొని, ఎవరి కాల్లో పట్టుకొని మేము రాజకీయాల్లోకి రాలేదు. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నువ్వు కాదు, ఎవరొచ్చినా పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రజాపాలన అందిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.

Read More »

ఈనెల 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఈనెల 22 నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు. ఇందుకు అనుమతించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వికాస్రాజ్కు విజ్ఞప్తి చేసింది. ఈ యాత్రలో భాగంగా కేసీఆర్ పంట పొలాలు, కల్లాలు, కొనుగోలు కేంద్రాల సందర్శనతో పాటు వివిధ వర్గాలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Read More »

రాయి దాడి కేసు.. నిందితుడి వాంగ్మూలం కోసం పిటిషన్

సీఎం జగన్పై రాయి దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జడ్జి సమక్షంలో నిందితుడు సతీశ్ వాంగ్మూలాన్ని తీసుకునేందుకు అనుమతి కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా నిన్న సతీశు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.

Read More »

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో వాన పడుతోంది. హైదరాబాద్ నగరంలోనూ పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అకాల వర్షాలకు వరి కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు ఆరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

Read More »

నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ అడుగుపెట్టనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి నుంచి అనకాపల్లి నియోజకవర్గం మీదుగా పెందుర్తి చేరుకోనున్నారు. సా.3.30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభ ఉండనుంది.

Read More »

కేసీఆర్ బ‌స్సు యాత్ర షెడ్యూల్ ఖ‌రారు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సుయాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు తాజాగా ఈ బ‌స్సు యాత్ర షెడ్యూల్ ఖ‌రారైంది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో రాష్ట్రంలో చేప‌ట్టిన‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లే యోచ‌న‌లో గులాబీ బాస్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌, బీజేపీ వైఫ‌ల్యాల‌ను కూడా ఎత్తిచూప‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ యాత్ర‌కు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇక‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా దెబ్బ‌తిన్న గులాబీ ...

Read More »

నెల్లూరు జిల్లాలో జనసేనకు భారీ షాక్.. వైసీపీలో చేరిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు జిల్లాలో టీడీపీ, జనసేనకు భారీ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పారు. అంతేకాదు వైసీపీలో చేరారు. జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డితో పాటు నెల్లూరు మండల అధ్యక్షుడు కాటం రెడ్డి జగదీశ్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, టీడీపీ నేత చేజెర్ల సుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరు జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో జిల్లాలో ...

Read More »

అధికారులపై ఫిర్యాదులు..ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం:ఎంకే మీనా

ఏపీ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర పదజాలం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులపై కొందరు ముఖ్య నాయకులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ...

Read More »

హ్యాపీ బర్త్ డే అమ్మా: జగన్, షర్మిల

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ జన్మదినం నేడు. ఈ సందర్భంగా తన తల్లికి జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా’ అని ట్వీట్ చేశారు. ఓ కార్యక్రమంలో తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి, ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ ...

Read More »