Politics

అలా చేస్తే కాళేశ్వరం పూర్తిగా కూలిపోతుంది: ఉప ముఖ్యమంత్రి బట్టి

తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మేడిగడ్డ మాదిరిగా సుందిళ్ల, అన్నారం పరిస్థితి ఉండబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని. పగుళ్లకు రిపేర్లు చేస్తే ఉన్న ప్రాజెక్టు కూలిపోతుంది. ప్రజెక్టులు ...

Read More »

వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం..!

త్వరలో ఖాళీ అయ్యే 3 రాజ్యసభ స్థానాల్లో YCP అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. నిన్న నామినేషన్ల పరిశీలనలో పత్రాలు సరిగ్గా లేకపోవడంతో ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. వైసీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లను మాత్రమే ఆమోదించారు. ఈ నెల 20న వారి ఎన్నికపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Read More »

వైసీపీ ఏడవ జాబితా విడుదల.. ఇద్దరికి టికెట్ నిరాకరణ!

రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మార్పు చేర్పులను వైసీపీ నాయకత్వం కొనసాగిస్తోంది. తాజాగా నిన్న రాత్రి వైసీపీ ఏడో జాబితాను విడుదల చేసింది. ఏడో జాబితాలో ఇద్దరికి టికెట్ ను నిరాకరించింది. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో పాటు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆమంచి కృష్ణమోహన్ కు మొండిచేయి చూపారు. కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జీగా కటారి అరవింద యాదవ్ ను సీఎం జగన్ రంగంలోకి దించారు. పర్చూరు ఇన్ఛార్జీగా యడం బాలాజీని నియమించారు. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించే ఏడో జాబితాను విడుదల చేశారు. ...

Read More »

కారు నెంబరు ప్లేట్ పైన మోదీ అని రాసుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే..?

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పటి సీఎం కేసీఆర్‌ను, ప్రస్తుత సీఎం అయిన రేవంత్ రెడ్డిని ఓడించిన ఘనత ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిది. ఈయన పేరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుంటే ఆయన తన కారు నెంబరును 4749ను ఎంపిక చేసుకున్నారు. ఐతే ఏంటటా అనుకునేరు, అక్కడే వుంది అసలు సంగతి. ఆ నెంబరును మోడీ అని హిందీ అక్షరాలు వచ్చేట్లు డిజైన్ చేయించుకుని తిరుగుతున్నారు. దీనితో ఆయన మరింత చర్చనీయాంశంగా మారారు.

Read More »

కొలిక్కిరాని రెబల్ ఎమ్మెల్యేల అంశం.. మరోసారి నోటీసులు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే మరో వైపు రెబల్ ఎమ్మెల అంశం ఆశక్తికరంగా మారింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరు కావాల్సిందిగా స్పీకర్ ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ ఆదేశాల నిమిత్తం గతంలో పలు రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరైయ్యారు. అయితే తాజాగా మరోసారి విచారణకు రావాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం జరిగే ...

Read More »

ఇరిగేషన్ శాఖలో అవినీతిపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజీ అన్నారు. దురదృష్టవశాత్తు నాణ్యతాలోపంతో బ్యారేజీ కుంగిందన్నారు. అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పూర్తి దెబ్బ తిందన్నారు. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీ మూడేళ్లలోనే కుప్పకూలిందన్నారు. గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి ఎక్కడా జరగలేదన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారన్నారు. ...

Read More »

నాలుక మడతపడకుండా చూసుకో లోకేశ్… అంబటి కౌంటర్

నువ్వు చొక్కాలు మడతపెట్టి మా మీదకు వస్తానంటున్నావు… నువ్వు ఆ పని చేస్తే మేం కుర్చీ మడతపెట్టి నీకు సీటు లేకుండా చేస్తాం అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఓ ఇనుప కుర్చీని స్వయంగా మడతపెట్టి చూపించారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నారా లోకేశ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. “కుర్చీ సంగతి తర్వాత… ముందు నీ నాలుక మడతపడకుండా ...

Read More »

రఘువీరారెడ్డి పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి ఫైర్..

వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టిన తర్వాత సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. షర్మిలతో పాటు ఆయన రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పక్కనే ఉంటూ ఆమెకు సలహాలు ఇస్తూ, దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘువీరాపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పుట్టపర్తి సత్యసాయిబాబా చనిపోయినప్పుడు ఆయన పార్థివదేహాన్ని తరలించకుండా డబ్బు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరా అని పెద్దిరెడ్డి అన్నారు. రఘువీరా ఒక పొలిటికల్ బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు ...

Read More »

కదిరిలో ఆసక్తికర పరిణామం.. ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి బుజ్జగింపులు

ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. పలు చోట్ల సిట్టింగ్‌లను సైతం పక్కనపెట్టేశారు. దీంతో అధిష్టానంపై ఆయా ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. కొందరైతే పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు అసంతృప్తిగా ఉన్నారు. వీరిని లైన్‌లోకి తెచ్చుకునేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయా ఎమ్మెల్యేలను మంత్రి పెద్దిరెడ్డి కలిసి పార్టీలో కొనసాగాలని కోరుతున్నారు. తాజాగా కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డిని బుజ్జగించారు. ...

Read More »

ఏపీలో బీజేపీ నాయకుడే సీఎం కావాలి.. విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ వ్యక్తి కావాలని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ 20 సీట్లు డిమాండ్ చేస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని.. బీజేపీ అభ్యర్థికి సీఎం పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరినో తమ భుజాలపైకి ఎక్కించుకునే పని తమది కాదని పేర్కొన్నారు. 2014లో మాదిరిగా కాదని.. ప్రస్తుతం పరిస్థితులు మారాయని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, అమిత్ షా భేటీపై తమకు అధికారిక ...

Read More »