Technology

ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ పాలిటెక్నిక్‌ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే.. 94.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖ జిల్లాకు చెందిన కె.రోషన్‌లాల్‌, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్‌వర్ధన్‌ మొదటి ర్యాంకు సాధించారు. వీరిరువురికి 120 మార్కులు వచ్చాయి.

Read More »

ఈఎపిసెట్‌-2021 ఫలితాలు విడుదల

ఎపి అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎపి ఈఎపిసెట్‌-2021) ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే ఇంజినీరింగ్‌ ఫలితాలను వెల్లడించగా.. తాజాగా అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలను వెల్లడించారు. మంగళవారం మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశానికి 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 78,066 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఫలితాల్లో 72,488 (92.85 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వివరించారు.

Read More »

జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాల్సిందే : సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బోర్డులు ఇంటర్నల్‌ మార్కుల అసెస్‌మెంట్‌ను పూర్తి చేసి, జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పది రోజుల్లోగా బోర్డులను మూల్యాంకన విధానాన్ని రూపొందించి కోర్టుకు తెలియజేయాలని సూచించింది. 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపింది. అయితే, బోర్డులన్నింటికీ ఏకరూప మూల్యాంకన విధానం ఉండేలా ఆదేశాల ఇవ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉందని, అందువల్ల బోర్టులు తమ సొంత ...

Read More »

యూట్యూబ్‌లో ఇకపై ఆ యాడ్స్‌ కనిపించవు

ఫ్రీ మరియు ప్రీమియం ప్యాకేజీల ద్వారా వీడియో కంటెంట్‌ వినోదాన్ని అందిస్తున్న యూట్యూబ్‌ హర్షించదగ్గ నిర్ణయం తీసుకుంది. ఇకపై జూదం, మద్యం, రాజకీయాలకు సంబంధించిన యాడ్‌లను ప్రముఖంగా ప్రచురించకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్‌ 14న యూట్యూబ్‌ మస్ట్‌హెడ్‌ (యూట్యూబ్‌ టాప్‌ పేజీ) కంటెంట్‌కు ఉండాల్సిన అర్హతల జాబితాను రిలీజ్‌ చేసింది.     గ్యాంబ్లింగ్‌, ఆల్కాహాల్‌, పాలిటిక్స్‌, డ్రగ్స్‌కు లింకు ఉన్న యాడ్‌లేవీ ఇకపై యూట్యూబ్‌ టాప్‌, హోం పేజీలో కనిపించవని ఆదివారం యూట్యూబ్‌ సంస్థ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. యూట్యూబ్‌ను ఓపెన్‌ చేయగానే ...

Read More »

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు రద్దు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇంటర్‌ సెకండియర్‌కు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల్లో విద్యార్థులందరికీ గరిష్ట మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫస్ట్‌ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులను ప్రకటిస్తారు. 

Read More »

నైజీరియాలో ట్విట్టర్‌పై నిషేధం

ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా సంస్థలపై ఆంక్షలు మొదలయ్యాయి. వీటిలోని కంటెంట్‌ను కట్టడి చేసేందుకు భారత్‌ ఐటి నూతన నిబంధనలు తీసుకోవస్తే… నైజీరియా ఏకంగా నిషేధాన్ని విధించింది. ట్విట్టర్‌ను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. నైజీరియా అధ్యక్షుడు మహ్మద్‌ బుహరీ చేసిన ట్వీట్‌ను తొలగించిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆగేయ ప్రాంతంలో నివసిస్తున్న కొంత మందిని ఉగ్రవాదులుగా భావిస్తున్నానంటూ… వేర్పాటువాద ఉద్యమాన్ని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఇది వివాదాస్పదమవ్వడంతో ఆ ట్వీట్‌ను ట్విట్టర్‌ తొలగించింది. ఈ చర్యపై మండిపడ్డ నైజీరియా సమాచార శాఖ మంత్రి ...

Read More »

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో.. పదో తరగతి పరీక్షలను నిర్వహించడంలేదు. ఇంటర్నల్‌ అసెస్మెంట్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌ లను నిర్ణయించారు. పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా అధికారులు ప్రకటించారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారు ఉన్నారు. రెగ్యులర్‌ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో ...

Read More »

ఎపిలో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 23 వరకు ఇంజనీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. 23 నుంచి 25 వరకు మెడిసిన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 118 సెంటర్లను ఏర్పాటు చేసింది. మొత్తం 2,72,900 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలి. మాస్క్‌ ధరించిన విద్యార్థలను మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి. ...

Read More »

ఇసెట్‌కు 85.84 శాతం హాజరు

ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఇసెట్‌)కు 85.84 శాతం విద్యార్థులు హాజరయ్యారు. 36,989 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 31,891 మంది విద్యార్థులు సోమవారం పరీక్ష రాసినట్లు ఎపి ఉన్నత విద్యామండలి సెట్ల కన్వీనరు ఎం.సుధీర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 72 పరీక్షా కేంద్రాలను, హైదరాబాద్‌లో 3 కేంద్రాలను ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, బిఎస్‌సి మేథమెటిక్స్‌ సిరామిక్‌ టెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, సిఎస్‌ఇ, ఇఇఇ ...

Read More »

తెలంగాణలో కొనసాగుతున్న ఎంసెట్

 తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలలో కరోనా నిబంధనలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్‌ జిల్లాలో తొలిరోజు ఒక్క సెంటర్‌లోనే పరీక్ష జరగనుందని, రేపటి నుండి ఎనిమిది సెంటర్‌లలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,43,165 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. తెలంగాణలో 79, ఎపిలో 23 చొప్పున మొత్తం 20 టెస్ట్‌ జోన్‌లలో 102 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,10,11,14 తేదీలలో ప్రతి రోజు రెండు విడతల చొప్పున మొత్తం ఎనిమిది విడతల్లో ఈ పరీక్ష ...

Read More »