ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.6,072.86 కోట్లకే ప్రజలపై ఇంత భారీగా చార్జీల భారం పడుతుంటే వచ్చే నెల నుంచి కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల మీద మరో పిడుగు వేయనుంది. రూ.9,412.50 కోట్ల చార్జీల వసూలుకు డిస్కమ్‌లు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ నెల వినియోగం నుంచి అంటే జనవరి మొదటి వారం నుంచి వచ్చే విద్యుత్ బిల్లుల్లో ఈ చార్జీలను ప్రభుత్వం వసూలు చేయనుంది. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుంటే దానికి తోడు విద్యుత్ చార్జీల బాదుడుతో సామాన్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.