ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు కాలేదు. తక్కువ కాలంలోనే ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం సామాజిక భద్రత ఫించన్లను పెంచింది. దీంతో 60 లక్షల మందికి పైగా ప్రజల కళ్ళల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆనందాన్ని నింపింది. మెగా డిఎస్సీపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. డీఎస్సీ అభ్యర్థుల కోరిక మేరకు టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేసింది. రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు కొత్త ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా తన పాలనా అనుభవాన్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు నిధుల కొరత ఉన్నప్పటికీ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనను గాడిలో పెట్టేందుకు తీవ్రంగానే శ్రమించాల్సి వస్తోంది. సాధారణంగా ఎవరైనా కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత పాలన గాడిలో పడేందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలు ఇతర ప్రజాసమస్యలపై ప్రశ్నించేందుకు విపక్షాలు కూడా అధికారపక్షానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వైసీపీ నాయకులు మాత్రం ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకువండానే.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటున్నా.. ఏమి చేయడం లేదు.. హామీల అమలులో విఫలమైందంటూ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. దీంతో వైసీపీ నాయకులకు రాజకీయ పరిపక్వత లేదనే ప్రచారం జరుగుతోంది.
- Home
- News
- Andhra Pradesh
- నెల రోజులు కాకుండానే ఎదురుదాడి.. వైసీపీ నేతలకు ఏమైంది..?