ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసేపట్లో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేసరపల్లిలోని ఐటీ టవర్ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రముఖులు తరలివస్తున్నారు. ఉదయం 11:27 గంటలకు ప్రమాణస్వీకార ముహూర్తం కాగా.. ఉదయం నుంచే జనం తరలివచ్చారు. ఉదయం 9 గంటలకే సభావేదిక కిక్కిరిసిపోయింది. చాలామంది సీట్లు లేక నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజారపు రామ్మోహన్ నాయుడు ఇప్పటికే సభావేదికపైకి వచ్చారు. ఆయనతో పాటు మరో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా సభా వేదికపై కనిపిస్తున్నారు.