ఏపీలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అప్పటి నుంచేనా?

gass-1-1.jpg

డీపీ కూటమి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్‌లు అంటూ కూటమి భారీ వరాలు కురిపించింది. ఉచిత బస్ దగ్గరి నుంచి చాలానే పథకాలు అందిస్తామని హామీ ఇచ్చింది. వీటిల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఒక భాగమనే చెప్పుకోవచ్చు. మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు త్వరలోనే ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందని జనాలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం పండుగ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో దసరా లేదా దీపావళి వంటి పండుగలకు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను ప్రకటిస్తే మహిళలకు భారీ ఊరట లభిస్తుందని ఇంకొంత మంది అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో అధికారం తెలియదు. రానున్న కాలంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రీ సిలిండర్ లభిస్తే.. చాలా మందికి ఊరట లభిస్తుంది. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు స్కీమ్‌పై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 1.3 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అందువల్ల అందరికీ స్కీమ్ వర్తిస్తుందా? లేదంటే నిబంధనలు ఏమైనా పెడతారా? అనేది చూడాలి.

Share this post

scroll to top