తెలంగాణలోని ఏడు మండలాలను గతంలో ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 2014లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఏపీలో విలీనం చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ మండలాల విలీనంపై తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికీ విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్ గా మారాయి.