వైష్ణవీ చైతన్య ‘చెన్నై లవ్ స్టోరీ’

Vaishnavi-.jpg

టాలీవుడ్ లో ఇప్పుడు వైష్ణవి చైతన్యకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ‘బేబి’ సినిమాతో ఆమె స్టార్ డమ్ ను అందుకుంది. ఆమె తాజా చిత్రంగా వచ్చిన ‘లవ్ మీ’ కూడా ప్రస్తుతం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఆ తరువాత ఆమె చేయనున్న సినిమా ఏమిటనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. 

వైష్ణవీ చైతన్య తన తదుపరి సినిమాను ఆనంద్ దేవరకొండతో చేయనుంది. ‘బేబి’ సినిమాలో ఈ జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అందువలన మళ్లీ ఈ జంటను తెరపై చూడటానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. అందువల్లనే ఈ ఇద్దరితో మరో ప్రాజెక్టును ‘బేబి’ టీమ్ ప్లాన్ చేసింది. ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే పేరుతో ఈ సినిమా రూపొందనుంది. 

Share this post

scroll to top