కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ యాధృచ్చికంగా బీజేపీ మీద విమర్శలు చేశారా.. లేక నిజంగానే బీజేపీ ఒక్క సీటు గెలవలేదా అనే చర్చ తెరమీదకు వచ్చింది. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ మొత్తం ఆరు ఎంపీ, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. వాస్తవంగా ఆ పార్టీ బలానికీ, పోటీ చేసిన సీట్లకూ పొంతన లేదు.
టీడీపీ, జనసేన ఓట్లు ఏ మేరకు బీజేపీ అభ్యర్థులకు బదిలీ అయ్యాయనే అంచనా మేరకు చింతా మోహన్ అలా వ్యాఖ్యానించి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.