మోహన్ రాజా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగాస్టార్

mgstr-1.jpg

చిరంజీవి ఇప్పుడు విశ్వంభర షూటింగులో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. శ్రీవశిష్ఠ దర్శకత్వంలో .. యూవీ నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమౌతోంది. ఈ సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తరువాత ఏ దర్శకుడితో చిరంజీవి చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ డైరెక్టర్లు చాలామంది ఆయనతో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే దర్శకుడు మోహన్ రాజాతో సినిమాను చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు మోహన్ రాజా – చిరంజీవి కాంబినేషన్లో గాడ్ ఫాదర్ వచ్చింది. అయితే ఇప్పుడు మోహన్ రాజా వినిపించిన కథ, చిరంజీవికి బాగా నచ్చిందట. అందువలన ఆయన ఈ ప్రాజెక్టును ముందుగా చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే మోహన్ రాజా కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం.

Share this post

scroll to top