ఇవాళ్టి నుంచి రెండ్రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశమవుతోంది. సభ్యులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయిస్తారు. ముందుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులచే ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత.. మహిళా ఎమ్మెల్యేలు, సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇక శనివారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. శాసనసభలో టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేలతో పాటు ప్రమాణం చేయనున్నారు వైసీపీ అధినేత జగన్. ఏపీ అసెంబ్లీలో 81మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్నూలు జిల్లా నుంచి ఐదుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. జనసేన అధినేత పవన్, లోకేష్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన సుజనాచౌదరి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఈసారి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్‌లు కూడా ఈసారి శాసనసభకు ఎన్నికయ్యారు.
- Home
- News
- Andhra Pradesh
- తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన పవన్, లోకేష్..