‘విశ్వవేదికపై తెలుగు కవిత కీర్తిపతాకను ఎగురవేసిన మహాకవి శ్రీశ్రీ జయంతి నేడు. కవిత్వానికి ఉండే శక్తి ప్రపంచాన్ని కదిలించగలదని, సమాజ హితానికి తోడ్పడగలదని శ్రీశ్రీ తన అభ్యుదయ రచనల ద్వారా చాటిచెప్పారు. ఆయన రచనలు తరతరాలకూ స్ఫూర్తినిరగిలించే దివిటీలుగా నిత్యం వెలుగుతూనే ఉంటాయి.’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తి