జగన్ నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్ ది ఓషన్’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, బీచ్ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సిఎం సందర్శించారు. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ గిన్నిస్ రికార్డు నెలకొల్పేలా నేడు బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సాగరతీరాన్ని పరిశుభ్రం చేసింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం 20 వేల మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
