సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌..

pspk-chandrababu-18.jpg

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు పలు శాఖలకు మంత్రులుగా నియమించారు. ఆ తరువాత ఏపీ సచివాలయానికి చేరుకున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సచివాలయానికి చేరుకున్న వెంటనే సెక్రటరీలు, పోలీసు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. సచివాలయంలో అడుగు పెట్టిన వెంటనే పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఆ తరువాత సచివాలంలోని తన ఛాంబర్‎ను పరిశీలించారు. ఇదిలా ఉంటే గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అమరావతి మీదుగా సచివాలయానికి చేరుకునే మార్గం మొత్తం అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారిపొడవునా పూలు వేస్తూ గజమాలలతో ఘనస్వాగతం పలికారు. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. సచివాలయంలోని సీఎం చాంబర్‎కు నేరుగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. 

Share this post

scroll to top