దశాబ్ధి వేడుకలకు సోనియాను ఆహ్వానించేందుకు.. నేడు దిల్లీకి సీఎం రేవంత్

revanths-jsdfh.jpg

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ దిల్లీ, కేరళ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మొదట కేరళ వెళ్లనున్న ఆయన.. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం దిల్లీకి పయనమవుతారు. జూన్‌ 2వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు. అదే విధంగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌, ప్రియాంకా గాంధీలను అవతరణ వేడుకలకు సీఎం ఆహ్వానించనున్నారు.

మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌ నుంచి కేరళ వెళ్లనున్న సీఎం కోజీకోడ్‌లో జరిగే ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి దిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ అవతరణ వేడుకల నిర్వహణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చిన నేపథ్యంలో… కార్యక్రమాన్ని ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రావతరణలో కీలకభూమిక పోషించిన సోనియాతో పాటు అమరుల కుటుంబాలను ఈ వేడుకల

Share this post

scroll to top