33జిల్లాలను కుదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగియగానే ఈప్రక్రియపై ఫోకస్ పెట్టనుంది సర్కార్. జిల్లాల పునర్విభజనపై తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతమున్న 33 నుంచి 17 కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జిల్లా విస్తరణ అశాస్త్రీయమని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆదిశ చర్యలు చేపట్టనున్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ యోచిస్తుంది.