తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కళాకారుడు రుద్ర రాజేశం,మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రూపుదిద్దుకోనుంది తెలంగాణ రాష్ట్ర చిహ్నం.
ఇక అటు తెలంగాణ ప్రభుత్వం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర గీతం పై వివాదం కొనసాగుతోంది. మన తెలంగాణ రాష్ట్రం మన పాట అంటూ తెలంగాణ వాదులు తమ గొంతుకను వినిపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే.. అందెశ్రీ, కీరవాణికి పోటీగా మిట్టపల్లి సురేందర్ రంగంలోకి దిగారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అసలు సిసలైన తెలంగాణ గేయం రిలీజ్ చేస్తున్నామంటోంది మిట్టపల్లి టీం. తెలంగాణ పాటకు మిట్టపల్లి మార్క్ ఉండబోతుందని ప్రకటించింది మిట్టపల్లి టీం.