రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. విగ్రహ తయారీ తుది మెరుగుల పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం తయారీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. తాాజాగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి.. అవుటర్ రింగు రోడ్డు దగ్గర తయారు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ పనులను సీఎం పరిశీలించారు. శిల్పిని విగ్రహాన్ని తయారీ పనులపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. విగ్రహం తుది మెరుగులపై పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.