తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది.. సీఎంల భేటీపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్‌

telangana-08-1.jpg

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని కామెంట్స్‌ చేశారు.

కాగా, జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ గేమ్‌ స్టార్ట్‌ చేసింది. టీడీపీని ముందుపెట్టి బీజేపీ పొలిటికల్‌ గేమ్‌ ఆడుతోంది. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ కేడర్‌ అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నాను. సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టాడు.చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలో రాజకీయం మొదలు పెట్టాడు. కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ, జనసేనను బీజేపీ రంగంలోకి దింపింది. చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నాడు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదే సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కూడా జగ్గారెడ్డి కౌంటరిచ్చారు. దేశంలో బలమంతా ఈడీ, సీబీఐ, ఐటీ చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు బీజేపీలో చేరిన వారంతా వివిధ కేసుల్లో ఉన్నవారే ఉన్నారు. ఇంత కన్నా సాక్ష్యం ఏం కావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, జగ్గారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ఇక, ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. 
 

Share this post

scroll to top