సీఎంతో నాకు ప్రాణహాని ఉంది.. హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్

సీఎంతో నాకు ప్రాణహాని ఉంది.. హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్

తనకు ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం తనకు 2+2 భద్రత కల్పిస్తున్నారని దాన్ని 4+4కు మార్చడంతో పాటు ఎస్కార్ట్ సదుపాయం కూడా కల్పించాలని రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో కోరారు. దానికి బలమైన కారణాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మై హోం రామేశ్వరరావును కూడా జత చేస్తూ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.