దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం

భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 3,20,418 మందికి కోవిడ్‌ టెస్టులను నిర్వహించగా కొత్తగా 5,439 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 65,732 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా, రికవరీ రేటు 98.66 శాతంగా, క్రియాశీల రేటు 0.15 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 88.55 కోట్ల కోవిడ్‌ టెస్టులను నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఇప్పటి వరకు 212.17 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్‌ ను పంపిణీ చేశారు. వీరిలో 94.23 కోట్ల సెకండ్‌ డోసులు, 15.66 కోట్ల ప్రికాషన్‌ డోసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 26,36,224 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.