చైనాలో పెరుగుతున్న కరోనా డెల్టా కేసులు

చైనాలో కొవిడ్‌ వైరస్‌ డెల్టా వెరియంట్‌ విజృంభిస్తోంది. ఈనెల 17వ తేదీ నుండి ఇప్పటి వరకు 11 ప్రావిన్స్‌లకు ఈ డెల్టా వెరియంట్‌ విస్తరించినట్లు స్థానిక వైద్య అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల కారణంగానే ఈ వేరియంట్‌ చైనాలోకి ప్రవేశించిందని చెప్పారు. కొవిడ్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులను విధించినట్లు తెలిపారు. గాన్సు ప్రొవిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజా రవాణాను నిషేధించారు. శనివారం నాడు మొత్తం ఏడు ప్రావిన్సిలలో 26 కేసులు నమోదైనట్లు స్థానిక వైద్య అధికారులు తెలిపారు. బీజింగ్‌లోనూ కేసులు బయటపడ్డాయి. అక్కడ కూడా వైరస్‌ విస్తరిస్తోంది. దీంతో కరోనా ప్రభావిత ప్రాంతాల నుండి బీజింగ్‌కు రాకపోకలను నిషేధించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 31వ తేదీన బీజింగ్‌లో నిర్వహించాల్సిన మారధాన్‌ను రద్దు చేశారు.