పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పిదప మీరు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, ప్రాజెక్టు లోపాలపై మాట్లాడటం అభినందనీయం అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం పరిపూర్తికి కేంద్రానిదే బాధ్యత అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ కాలంలోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలి.. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన నిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి రూ.33 వేలకోట్ల నిధుల విడుదలకై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని లేఖలో డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ..