మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారించే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన దాఖలు చేసిన పిటిషన్ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని తెలిపింది. అందుకే ఈ పిటిషన్ విచారణర్హమైనది కాదని పేర్కొంది.