ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గాలంటే ఈ ఫేస్ మాస్క్ వేయాల్సిందే..

ఫేస్ మాస్క్స్ చాలా మందికి ఫేవరేట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. అవి అప్లై చేసుకోవడం తేలిక, మంచి ఫలితాలు ఉంటాయి. ఫేస్ మాస్క్ తర్వాత స్కిన్ టోన్డ్‌గా మారుతుంది. రెగ్యులర్‌గా ఫేస్ మాస్క్స్ వాడడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఫేస్ మాస్క్స్ ని రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఈ మాస్క్స్ ని వారానికి ఒకసారీ, రెండు సార్లూ యూజ్ చేయొచ్చు. రోజూ కూడా యూజ్ చేసుకోవచ్చు. హోం మేడ్ ఫేస్ మాస్క్స్ లో అన్నీ నాచురల్ ఇంగ్రీడియెంట్సే ఉంటాయి. కాబట్టి, రోజూ వాడినా కూడా పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. ఫేస్ మాస్క్స్ వల్ల జరిగే మేలు ఏమిటో చూద్దాం రండి.

ఫేస్ మాస్క్స్ వల్ల అవుట్‌సైడ్ అప్పియరెన్స్ బాగుండడమే కాదు, ఎంతో రిలాక్సింగ్‌గా కూడా అనిపిస్తుంది. ఈ ఫేస్ మాస్క్స్‌లో ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ కలుపుకుంటే నీరసం ఎగిరిపోయి ఉత్సాహంగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఫేస్ మాస్క్ వేసుకునేటప్పుడు కొంత సమయం మీ చేతిలో ఉండేలా చూసుకోండి. రూం ఫ్రెషనర్ యూజ్ చేస్తారో, అగరువత్తులు వెలిగించుకుంటారో మీ ఇష్టం. మంచి రూమ్‌లో మంచి మ్యూజిక్ పెట్టుకునీ మంచి స్మెల్ కూడా వస్తుంటే..ఫేస్ మాస్క్‌ని కూడా ఎంజాయ్ చేస్తారు. మీకు గ్లోయింగ్ స్కిన్‌తో పాటూ ఒక వండర్‌ఫుల్ ఎక్స్పీరియెన్స్ సొంతం అవుతుంది.

రెగ్యులర్‌గా ఫేస్ క్లెన్సర్ వాడడం వల్ల మురికీ, జిడ్డూ, మేకప్, ఇంకా ఇంప్యూరిటీస్ అన్నీ తొలగిపోతాయి. కానీ, ఫేస్ మాస్క్ ఈ క్లెన్సింగ్ ప్రాసెస్‌ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. రెగ్యులర్ క్లెన్సింగ్ పైపైన ఉండే ఇన్‌ప్యూరిటీస్‌నే తొలగిస్తుంది. ఫేస్ మాస్క్స్ మాత్రం చర్మం లోపల దాక్కుని ఉన్న ఇన్‌ ప్యూరిటీస్ ని కూడా బైటికి తీసుకొస్తాయి. ఈ డీప్ క్లెన్సింగ్ ఫేస్ మాస్క్స్ మాత్రమే చేయగలుగుతాయి. రెగ్యులర్ ఫేస్ క్లెన్సర్స్ వల్ల ఇలాంటి క్లెన్సింగ్ జరగదు.