ఇప్పుడు అందరం ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాం. హెల్దీ లైఫ్ స్టైల్ కి అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాం. అలాంటి హెల్దీ ఫుడ్స్ లో ఒకటి సీతా ఫలం. ఇది సీతా ఫలాలు వచ్చే కాలం. ఏ కాలం లో వచ్చే పండ్లూ కూరగాయల్ని ఆ కాలంలో తీసుకోవడం వల్ల సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. సీజనల్ ప్రాబ్లమ్స్ తగ్గించడమే కాకుండా సితాఫలంలో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో, ఈ కాలంలో ఈ పండు ని ఎందుకు రెగ్యులర్ గా తీసుకోవాలో తెలుసుకోండి.
సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది. సమతులాహారానికి ఉదాహరణగా ఈ పండుని చెబుతారు. ఇందులో కాలరీస్, ప్రోటీన్, ఫ్యాట్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివన్నీ సరైన క్వాంటిటీలో ఉంటాయి.
సీతాఫలంలో ఉండే ఫైబర్, మినరల్స్ వల్ల ఈ పండు అరుగుదలకి తోడ్పడుతుంది. బౌల్ మూమెంట్‌కి సహకరిస్తుంది. తద్వారా, గ్యాస్, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు దూరమౌతాయి. అంతే, కాకుండా డయేరియా లాంటి ప్రాబ్లంస్ కి కూడా ఈ పండు చెక్ పెడుతుంది.
సీతాఫలంలో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ విటమిస్న్ వయసు మీద పడకుండా చేస్తాయి. ఈ పండులో ఉండే యాంటీ-ఏజీయింగ్ ప్రాపర్టీస్ వలన స్కిన్ మంచి గ్లో తో ఉంటుంది. ఈ పండు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి సెల్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది.