విద్యార్థులు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి..

rss-30.jpg

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యల గురించి బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ శాఖ మంత్రి లేడని అన్నారు. అంతేకాకుండా ఎస్టీ శాఖ మంత్రి కూడా లేడని మైనారిటీ శాఖ మంత్రి లేడని, విద్యా శాఖ మంత్రి లేడని ఎద్దేవా చేశారు. విద్యార్థులు వారి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని గొంతెత్తి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా పాలన అన్నారు కానీ ప్రజలపైన నిరుద్యోగుల పైన ప్రతీకార పాలన నడుస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 12.30 లక్షల మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వంపై ఓ రేంజ్ లో మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు కాలేజీల్లో సర్టిఫికెట్లు తీసుకోలేక బాధపడుతున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలల్లోని ఫుడ్ పాయిజనింగ్ గురించి, భోజనంలో ఎలుకలు రావడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా తక్షణమే విద్యార్థుల సమస్యలకు చెక్ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Share this post

scroll to top