ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగలింది. జూన్ 3 వరకు జుడీషియల్ రిమాండు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆమెకు కోర్టు గతంలో విధించిన జుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఇవాళ ఆమెను వర్చువల్గా కోర్టులో హాజరుపరచగా కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. మార్చి 26 నుంచి ఆమె కస్టడీలో ఉంటుంది.