డెల్టాప్లస్‌ యమ డేంజర్‌.. 90 శాతం వేగంగా వ్యాప్తి

రాష్ట్రంలో సెకండ్‌వేవ్‌కు ప్రధాన కారణం కరోనా వైరస్‌లోని డెల్టా మ్యూటెంట్‌. అంతకముందు వ్యాప్తి చెందిన వైరస్‌ రకాలతో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు 30-40 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్నాయి. అందుకే కొద్ది రోజుల వ్యవధిలోనే వేలాది కేసులు నమోదయ్యాయి. అయితే డెల్టాకు మరో రూపాంతరంగా ప్రస్తుతం కలవరపెడుతున్న డెల్టాప్లస్‌ వేరియంట్‌ అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది 90 శాతం వేగంగా వ్యాప్తి చెందే గుణాన్ని కలిగి ఉందంటున్నారు. అంటే సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు. ఈ మ్యూటెంట్‌ గనుక వ్యాప్తి చెందితే వేలాది కేసులు నమోదయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.