రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ పరిపాలన గాడి తప్పకూడదని కలెక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజలు తమని విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని, వారు తమ ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారన్నారని అధికారులకు చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలను తాము చేయగలమని, వాటిని ప్రజలకు తీసుకెళ్లేది ఐఏఎస్, ఐపీఎస్‌లే పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన పనులతో మిగిలింది పది లక్షల కోట్ల అప్పు అని డిప్యూటీ సీఎం విమర్శించారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, 40 శాఖల అధిపతులు, 26 జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకూ సమావేశం కొనసాగనుంది.