పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ నంబర్ ప్లేట్‌పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్..

pspk-1.jpg

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో వంద శాతం స్ట్రయిక్ సాధించింది. అయితే ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత పలువురు జనసేన కార్యకర్తలు, జనసేనాని అభిమానులు పవన్ కళ్యాణ్ పై అపారమైన అభిమానంతో వింత ప్రయత్నాలు చేస్తున్నారు. బైక్‌లపై నంబర్ ప్లేటుకు బదులు ‘‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ అంటూ రాయించుకొని పవన్ కల్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకునేందుకు యువత పోటీ పడి మరీ తమ నెంబర్ ప్లేట్లు తీయించుకొని జనసేన ముద్రతో బైక్‌లపై ఫిక్స్ చేయించుకున్నారు. నిన్న (బుధవారం) కాకినాడ జిల్లా ఉప్పాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలతో వారాహి సభ ఏర్పాటు చేసి మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి ప్రసంగించారు. అదేంటంటే..డిప్యూటీ సీఎం ‘పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అని నంబర్ ప్లేట్‌లపై ఉండడం గమనించి స్పందించారు. ఈ విషయానికై ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి చెడ్డపేరు తీసుకురాకండి అని చెప్పారు. ఒకానొక సమయంలో అధికారులు ఆపినప్పుడు మీరు ఎమ్మెల్యే తాలూకా అని చెబితే వారు నన్ను తిడతారు అన్నారు. అందరూ చట్టాలు పాటించండి అని సూచించారు. చట్టాలకు ఎవరూ వ్యతిరేకంగా నడుచుకోవద్దు అని తెలియజేశారు. ‘ కావాలంటే నా రెండెకరాల పొలంలో మడ్ రేస్ పెడతా..సరదాగా అక్కడికి వచ్చి అక్కడే రైడ్ చేయండి’ అన్నారు. మీరంతా బాగుండాలి అని అన్నారు.

Share this post

scroll to top