ప్రభాస్ కల్కిలో దిశా పటని రోల్‌ను ఆ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుందా..

prapas-05.jpg

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన కల్కి సినిమా రికార్డుల మోతమోగిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఊహించని విధంగా కలెక్షన్ సొంతం చేసుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది కల్కి సినిమా ఇప్పటికే ఈ సినిమా 700 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమాలో చాలా మంది సూపర్ స్థార్స్ నటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే ఈ సినిమాలో అందాల భామలు దీపికా పదుకొనె , దిశా పటాని హీరోయిన్స్ గా చేశారు. ఇదిలా ఉంటే కల్కి సినిమాలో దిశా పటాని పాత్ర కోసం ముందుకు మరో హీరోయిన్ ను అనుకున్నారని టాక్ వినిపిస్తుంది.

Share this post

scroll to top