తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేతలకు చంద్రబాబు తీవ్ర నిరాశా..

chandrababu-118.jpg

రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్‌ నాయకులను కాదని కొత్త వారికి చోటు కల్పించారు. తొలి నుంచి పార్టీ కోసం పని చేసిన వారు, గతంలో మంత్రులుగా పని చేసి, పార్టీలో, జిల్లాల్లో కీలకంగా ఉన్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వడంపై ఆ పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. గంటా, కళా, అయ్యన్న, గోరంట్ల, జ్యోతులకు మంత్రివర్గంలో దక్కని చోటు ప్రత్తిపాటి, సోమిరెడ్డి, కోట్ల, పరిటాలకు నో ఛాన్స్‌ జూనియర్లకు, కొత్త వారి వైపు మొగ్గు చూపిన చంద్రబాబు. 24 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారిగా మంత్రి పదవులు చేపడుతున్నారు. 2014–2019 మధ్య కాలంలో మంత్రులుగా పనిచేసి ఇప్పుడు గెలిచిన వారికీ అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వారిలో అచ్చెన్నాయుడు, నారాయణ, లోకేశ్‌కు మాత్రమే మళ్లీ మంత్రి పదవులు వచ్చాయి. మిగతా వారికి పదవులు దక్కలేదు. 

Share this post

scroll to top