తుఫాను ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అనంతపురం జిల్లాతో పాటు విజయవాడలోనూ గాలి వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఈదులు గాలులతో కూడిన వాన పడింది. దీంతో పొలాల్లో నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపకల్లు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. బూదగవి చెరువుకు భారీగా వరద నీరు చేరింది. విడపకల్లు మండలంలో వర్షం దెబ్బకు 19 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పొలికి -పెంచులపాటు, గోవిందవాడ-పాల్తూరు గ్రామాల మధ్య వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.