ఉప్పు ఎక్కువ తింటున్నారా?

Salt.jpg

ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త పోటు అనేది బాగా పెరుగుతుంది. రక్త పోటునే హైపర్ టెన్షన్ అని కూడి కూడా పిలుస్తారు. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రక్త పోటు ఎక్కువగా పెరిగితే కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఒక్కో పరిస్థితిలో కిడ్నీలు ఫెయిల్‌ అయి మరణించే అవకాశాలు ఉన్నాయి.

మీ ఆహారంలో ఉప్పును ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీని వల్ల అజీర్తి, అసిడిటీ సమస్యలు వస్తాయి. షుగర్ ఉన్నవాళ్లు కూడా ఉప్పును చాలా తక్కువగా తీసుకుంటూ ఉండాలి. డయాబెటీస్ ఉన్నవాళ్లు ఉప్పు పట్ల సరైన శ్రద్ధ తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో ఇన్సులిన్ లెవల్స్, గ్లూకోజ్ లెవల్స్ అనేవి దెబ్బతింటాయని నిపుణులు అంటున్నారు. దీంతో టైప్ – 2 డయాబెటీస్ రావచ్చు.

Share this post

scroll to top