జలుబు, దగ్గుని తగ్గించే ఈజీ రెసిపీ ఇదే..

జలుబు వచ్చిందంటే చాలు. దీంతో పాటు దగ్గు కూడా బోనస్‌గా వస్తుంది. ఈ సమస్యవ వస్తే ఓ పట్టాన పోదు. ఇలాంటి టైమ్‌లో ఆస్పత్రుల దొరికే మందుల కంటే ఇంట్లో తయారు చేసే రెమిడీస్ బాగా పనిచేస్తాయి. అది ఏంటో ఎలా తయారు చేయాలో చూద్దాం..

సీజన్ మారితే బానే ఉంటుంది. కానీ, ఇది మనల్ని ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. ఈ సమయంలో మన రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే, ఆ టైమ్‌లో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. ముఖ్యంగా బయట దొరికే ఆహారం తీసుకోకుండా ఉండటం, కాస్తా గోరువెచ్చగా నీరు తీసుకోవడం, శుభ్రమైన బట్టలు ధరించడం వంటివి జలుబు, దగ్గు, ఫ్లూని దగ్గరికి రాకుండా చేస్తాయి. అంతేకాదు, మీ ఆహార అలవాట్లని కూడా మార్చుకోవాలి. సహజంగా రోగ నిరోధక శక్తిని బలంగా చేసే వాటిని కూడా యాడ్ చేయడం మంచిది. ముఖ్యంగా దగ్గు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది. ఎందుకంటే, నాన్ స్టాప్‌గా దగ్గు వస్తే చాలా అలసటకు గురవుతారు. నలుగురిలో ఉన్నప్పుడు మాటిమాటికీ దగ్గు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని సిరప్ లు, ట్యాబ్లెట్స్ వేసుకున్నా దగ్గు తగ్గడం లేదా ? అయితే డోంట్ వర్రీ.. ఇంట్లోనే దగ్గు మందు తయారు చేసుకోవచ్చు.

ఇత‌ర నూనెల‌తో పోలిస్తే ఆలివ్ ఆయిల్ ధ‌ర చాలా ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే, అది అందించే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇందులో పోషకాలపరంగా, ఉపయోగాలు చాలా అధికంగా ఉన్నాయి. కాబట్టే, వంటకాల్లో ఈ నూనె వాడకం క్రమేపీ పెరుగుతోంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ఎన్నో కీల‌క పోష‌కాలు ఆలివ్ ఆయిల్‌లో ఉన్నాయి. శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. బ్లడ్ సెల్స్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది. ఈ ఆయిల్‌లో ఉన్న అద్భుతమైన గుణాలు చికిత్సాపరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అది మాత్రమే కాదు, ఆలివ్ ఆయిల్‌తో బ్యూటీ బెనిఫిట్స కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఈ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి.

అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని ఎప్పట్నుంచో చెబుతున్నారు. అల్లంని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనారోగ్యాలు దరి చేరవు. విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. దగ్గుతో పోరాడటానికి అల్లం శక్తివంతమైన పాత్రను కలిగి ఉంది. అల్లం గొంతు, శ్వాస కోశ చికాకు, మంటను తగ్గించడంలో సాయపడతుంది. అందుకే జలుబు, దగ్గు కోసం దాదాపు ప్రతి ఆయుర్వేద ఔషధం లో దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు. డికె పబ్లిషింగ్ రాసిన హీలింగ్ ఫుడ్స్ పుస్తకం ప్రకారం, “దీని అస్థిర నూనెలు ఎన్ఎస్ఎఐడి మాదిరిగానే రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇది ఫ్లూ, తలనొప్పి, నెలసరి సమయంలో వచ్చే నొప్పులకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.