ఈజిప్ట్‌కి చెందిన ఫెన్సర్ నాడా హఫీజ్, 7 నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్‌లో పోటీ పడింది. మొదటి మ్యాచ్‌లో గెలిచిన ఆమె, రౌండ్ 16లో పోరాడి ఓడింది. ఈ ఓటమి తర్వాత తాను 7 నెలల గర్భవతిని అంటూ బయటపెట్టింది నాడా హఫీజ్ 7 నెలల ప్రెగ్నెంట్ ఒలింపియన్! పోడియంలో ఇద్దరు ప్లేయర్లు పోటీ పడతారు, కానీ ఈసారి ముగ్గురు పోటీ పడ్డారు. నేను, నా పోటీదారుడు, ఇంకా ఈ ప్రపంచంలోకి రాని నా లిటిల్ బేబీ నాతో పాటు నా బిడ్డ కూడా ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా ఎన్నో ఛాలెంజ్‌లు ఫేస్ చేసింది. ప్రెగ్నెన్సీ ఎంత ఆనందాన్ని తెస్తుందో అంతే కష్టాన్ని కూడా తెస్తుంది. నా వ్యక్తిగత జీవితాన్ని, క్రీడా జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు చాలా కష్టపడ్డాను. పతకం గెలవకలేకపోయినా ఈ ప్రయాణం నాకు సంతృప్తిని ఇచ్చింది. 16 రౌండ్ దాకా రావడం కూడా గొప్ప విజయమే…