ఆంధ్రప్రదేశ్ సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హెచ్‌ఆర్‌ఏ 24 శాతం కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు నూతన ప్రభుత్వంలో 12వ పీఆర్‌సీ కమిషనర్‌ని నియమించాలని కోరారు. త్వరగా ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు.