అదేనా మా తప్పు టీడీపీకి ఆర్కే రోజా సూటి ప్రశ్న

ROJA-19.jpg

రుషికొండలో గత జగన్‌ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలు.. అక్రమ కట్టడాలని ప్రచారం చేస్తు‍న్న టీడీపీకి గట్టి ఎదురు దెబ్బలే తగులుతోంది. చంద్రబాబు మాదిరి జగన్‌ తాత్కాలిక భవనాలు నిర్మించి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయలేదని.. ప్రజా ధనంతో పటిష్టమైన ప్రభుత్వ భవనాలే నిర్మించారని ఇటు వైఎస్సార్‌సీపీ, అటు నెటిజన్లు కౌంటర్లు ఇస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఈ అంశంపై స్పందించారు.  రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా.. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా? అని టీడీపీ శ్రేణుల్ని గట్టిగా ప్రశ్ని‍ంచారు. ‘‘విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా?. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా?’’ అంటూ సెటైర్లు వేశారు. 

Share this post

scroll to top