రాష్ట్రంలో హిట్లర్, గడాఫీ పాలన నడుస్తుందని, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి, వెంకట్‌రెడ్డి దంపతులను పోలీసులుదారుణంగా కొట్టారు. వైయస్ జగన్, వైయస్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దారుణమైన పోస్టులు పెట్టారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను ఈనాడు పేపర్ బట్టలు విప్పించిన కార్టూన్లు వేయించిన ఘనుడు చంద్రబాబు. మహిళ హోంమంత్రి ఉన్నప్పటికి రాష్ట్రంలోని స్త్రీలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు. హోంమంత్రి అనిత ఇంటి దగ్గరే గంజాయి సాగు జరుగుతున్నా పట్టించుకోవడం లేద మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు.