F3లో వెంకీకి రేచీకటి.. వరుణ్‌కి నత్తి

టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తర్వాత వరుసగా హిట్‌ కొట్టే డైరెక్టర్‌ ఎవరంటే అనిల్‌ రావిపూడిని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అనీల్‌.. ఎఫ్‌ 2 సీక్వెల్‌గా.. ఎఫ్‌ 3 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీకి రేచీకటి, వరుణ్‌తేజ్‌కి నత్తి ఉంటాయని ఆయనే స్వయంగా తెలిపారు. డబ్బుచుట్టూ తిరిగే కథతో.. హీరోలకున్న బలహీనతలతో తెరపై నవ్వులు పూయిస్తారని.. అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి అనీల్‌ రావిపూడి అనుకున్నట్లుగా.. ఎఫ్‌ 3లో వెంకీ రేచీకటి, వరుణ్‌ నత్తి ఏ రేంజ్‌లో అలరిస్తాయో చూడాలి మరి.